Tuesday, September 6, 2011

Varalakshmi Vrathamu

On 12th August 2011, Friday, the Mahila Wing of TAM Bagan Datoh Branch have organised ‘Varalakshmi Vrathamu’ at Sri Venkateswara Devasthanamu, Sungai Sumun. Around 200 people have participated in the prayers to seek blessings from Goddess Lakshmi. 

Mahilas participating in the prayers

Mahilas participating in the prayers

Mahilas participating in the prayers

Mahilas participating in the prayers

20 comments:

  1. Mee Page chaala andhamauga vundhi. Meeku naa abinandhanalu

    Appanna Naidu (ex Bagan pasir Estate)
    Kuala Lumpur

    ReplyDelete
  2. తెలుగు వారు

    తెలుగు జనులు
    తెలివైన జనులు
    తెలుగు జనులు
    తేజోవంతులు

    తెలుగు తల్లులు
    అందరిని ప్రేమిస్తారు
    తెలుగు తల్లులు
    అనురాగముతో ఆహ్వానితారు

    తెలుగు తండ్రులు
    దొర చూపుతో చూస్తారు
    తెలుగు తండ్రులు
    విద్యకు ప్రధానమిస్తారు

    తెలుగు అమ్మాయులు
    అందంగా వుంటారు
    తెలుగు అమ్మాయులు
    తల్లితండ్రులను ఆదరిస్తారు

    తెలుగు యువకులు
    బాషా అబిమానులు
    తెలుగు యువకులు
    చాలా ధైరవంతులు

    ReplyDelete
  3. మరువకు

    రచన-అప్పన్న నాయుడు ఆడారి

    ఎంత గొప్పవాడైన
    ఎంత ధనవంతుడైన
    మరువకు నిన్ను శ్రుస్టించిన బగవంతుని
    మరువకు నీకు జన్మం ఇచ్చిన తల్లి తండ్రులని

    ఎంత విద్యావంతుడైన
    ఎంత గుర్తింపు వున్న
    మరువకు నీకు విద్య వోసంగిన ఉపాధ్యాయులను
    మరువకు నీ విద్యలో తోడుపడిన స్నేహితులను

    ఎంత క్రీడాకారుడైన
    ఎంత కళాకారుడైన
    మరువకు మానవ ధర్మాని
    మరువకు మానవ సత్యాని

    ఎన్నిదేశాలు పర్యటించిన
    ఎంత మంది నిన్ను పొగడిన
    మరువకు నీ జన్మబూమిని
    మరువకు నీ తెలుగు భాషనీ

    ReplyDelete
  4. ఏది ముఖ్యం
    రచన : ఆడారి అప్పన్న నాయుడు

    ఎంత కాలం బ్రతికావన్నది కాదు ముఖ్యం
    బ్రతుకున్నకాలం ఎంత మంచి చేసావన్నది ముఖ్యం
    ఎంత కాలం జీవించావన్నది కాదు ముఖ్యం
    మరణం తరువాయి ఎంత కాలం జీవించగలవన్నది ముఖ్యం
    ఎంతకాలం వుద్యోగం చేసావన్నది కాదు ముఖ్యం
    ఆ ఉద్యోగములో ఎంత సాధించావన్నది ముఖ్యం
    ఎంత మంచి వాడవన్నది కాదు ముఖ్యం
    ఆ మంచితన్నాని ఎంత మందికి పంచావన్నది ముఖ్యం
    ఎంత అందగాడవన్నది కాదు ముఖ్యం
    ఆ అందం నీ మనషులో ఉన్నదా లేదా అన్నది ముఖ్యం
    ఎంత బుద్ధివంతుడు అన్నది కాదు ముఖ్యం
    ఎంత మందిని బుద్ధివంతులు చేయ గలిగావన్నది ముఖ్యం
    ఎంత సంతతి వున్నారన్నదికాదు ముఖ్యం
    ఆ సంతతిలో ఎంత మంది కుళాసుగా జీవిస్తారన్నది
    ఎంతకాలం నాయకత్వం చేసావన్నది కాదు ముఖ్యం
    ఆ నాయకత్వానికి ఎంత న్యాయం చేయగలవన్నది ముఖ్యం
    ఎంత మందికి ధర్మం చేసావన్నది కాదు ముఖ్యం
    ఆ ధర్మం పలితం ఆశించకుంటా చేసావా లేదా అన్నది ముఖ్యం
    దేశములో ఎంత జనసంఖ్య వున్నారన్నది కాదు ముఖ్యం
    ఆ జనసంఖ్యలో ఎంత మంది హాయిగా జీవిస్తున్నారన్నది ముఖ్యం

    ReplyDelete
  5. నమ్మకం
    రచన : ఆడారి అప్పన్న నాయుడు

    ప్రతి దినం సమస్యలతో ప్రారంబించవద్దు
    రోజంతా సమస్య అయిపోతుంది
    ప్రతి రోజు సంతోషంగా ప్రారంబించు
    రోజంతా సంతోషంగా ఉండవచ్చు

    నీవు ధనవంతుడు అవుతావని నమ్ము
    దగ్గరగా వస్తుంది నీకు కావలసిన సొమ్ము
    నీవు బీధవాడవని ఎప్పుడు అనుకోవద్దు
    ఆ ఆలోచనే అవుతుంది నీకు అనుకోలేని హద్దు

    నీవు విజయం సాధించగలవని నమ్మకం పెట్టు
    నీవు విజేతవు అవగలవు అనుకున్నట్టు
    నీవు గొప్పవాడవగలవని ఆశ పెట్టు
    నీవు గొప్పవాడవుతావు అందరు గర్వ పడేటట్లు
    ఎనిమిది కోట్ల తెలుగు జనులు గర్వ పడేటట్లు

    ReplyDelete
  6. గతం

    రచన ఆడారి అప్పన్న నాయుడు

    గతం మరువవద్దు
    కానీ గతమే జీవితమని అనుకోవద్దు
    గతం చేసిన తప్పులు గ్రహించుకో
    చేసిన తప్పులు సరి దిద్దుకో
    గతములో చేసిన మంచి పనులు సాగించుకో
    ఆ మంచి పనులు నీ ఆత్మ త్రుప్తి యిచ్చినట్లు చూసుకో
    మీ తల్లితండ్రులు అంత గతమే
    వారిని ఆత్మీయతతో ప్రేమించడము మీకు పుణ్యమే
    మీ ఉపాధ్యాయలు మీకు చూపిన దారి
    మీ జీవితానికి అదే మీకు రహదారి
    గతం మీకు ఇచ్చును పలు ఆలోచనులు
    బవిషత్ మీకు ఇచ్చును ఎత్తు పల్లాలు
    జయాలలో చాలా అనంధపడవోద్దు
    అపజయాలలో చాలా విచారించవద్దు
    సమ గుణముతో జీవించడము నెర్చుకో
    సమత్వమే శాంతియుతకు మంచిదని తెలుసుకో

    ReplyDelete
  7. ఏది నీది
    రచన : ఆడారి అప్పన్న నాయుడు

    ఇది నాది అది నీది
    అని చెప్పడానికి ఎవరిచ్చారు నీకు ఆ హక్కు
    యిప్పుడో అప్పుడో తెలియని మనిషికి ఎవరిచ్చారు ఆ హక్కు

    ఈ గాలి నాదని
    ఈ నీలు నావని
    ఈ నది నాదని
    ఈ ప్రాంతం నాదని
    ఈ దేశం నాదని
    చెప్పడానికి ఎవరిచ్చారు నీకు ఆ హక్కు
    యిప్పుడో అప్పుడో తెలియని మనిషికి ఎవరిచ్చారు ఆ హక్కు

    ఈ సృష్టిలోవున్నవన్ని బగవంతుడవేవని
    ఈ లోకములో ఉన్నవన్నీ అతననివేవని
    మనిషికి తేయిక పోవడం మన దురదుష్టం
    ఈ మనిషికి తేయిక పోవడం మన దురదుష్టం
    ఈ దురదుష్టానికి ప్రతిబింబమే ఈ లోక కష్టం

    ReplyDelete
  8. కానీ, అమ్మకు నీవు ఏమి చేసావు
    రచన- ఆడారి అప్పన్ననాయుడు

    అమ్మ జాగ్రతవలన గర్బములో కులాసుగా పెరగగాలిగావు
    అమ్మ పాడిన జోలపాటలువలన చల్లగా నిధ్రపోగలిగావు
    అమ్మ పాలు త్రాగి నీ కండలు పెంచగలిగావు
    అమ్మ అనుబందంవలన మంచి ఆహారాలు బొంచేయగలిగావు
    కానీ, అమ్మకు నీవు ఏమి చేసావు

    అమ్మచూపిన శ్రద్ధవలన మంచి పాటశాలలికి వేల్లగలిగావు
    అమ్మ చెప్పిన కథలువిని ఆలోచనలు పెంచగలిగావు
    అమ్మ సందేశాలవలన బుద్ధిమంతుడు అవగలిగావు
    అమ్మ శాంతగునమువల్ల శాంతియుడుగా పెరగగలిగావు
    కానీ, అమ్మకు నీవు ఏమి చేసావు

    అమ్మ కష్టాలువలన గొప్ప విద్యావంతుడు అవగలిగావు
    అమ్మ చేసిన ప్రార్ధనవలన గొప్ప ధనవంతుడైనావు
    అమ్మ చూపిన ప్రేమవలన సంతోషముగా వుండగలిగావు
    అమ్మ కనురెప్పల చూడడంవలన మంచి మనిషిగా పెరగగలిగావు
    కానీ, అమ్మకు నీవు ఏమి చేసావు
    నిన్నుకన్న అమ్మకు నీవు ఏమి చేసావు

    ReplyDelete
  9. ఈ జీవన ప్రయాణము
    .....ఆడారి అప్పన్న నాయుడు,
    మలేషియా

    ఎంతకాలము ఈ జీవన ప్రయాణము
    ఎంతకాలము ఈ జీవన చదరంగం

    ఎన్ని మలుపులు
    ఎన్నెన్ని వలపులు
    ఎన్ని బంధాలు
    ఎన్నెన్ని అనుబంధాలు

    ఎంతకాలము ఈ జీవన ప్రయాణము
    ఎంతకాలము ఈ జీవన చదరంగం

    ఎన్ని కష్టాలు
    ఎన్నెన్ని నష్టాలు
    ఎన్ని ఆనందాలు
    ఎన్నిన్ని అనురాగాలు

    ఎంతకాలము ఈ జీవన ప్రయాణము
    ఎంతకాలము ఈ జీవన చదరంగం

    ReplyDelete
  10. మీ జీవితం
    రచన -అప్పన్న నాయుడు

    మీ పెరుగుదల
    మీ ఒకరిలోలేదు
    మీ పెరుగుదల
    మీరు పెరుగుతున్న వాతావరనములో వుంది

    మీ జయాలు
    మీకున్న అవకాశములో లేదు
    మీ జయాలు
    మీకున్న అవకాశములు ఉ
    ఉపయోగించడంలో వుంది

    మీ సంత్రుప్తి
    మీకున్న ధురాషలలో లేదు
    మీ సంత్రుప్తి
    మీరుచేసే నిష్కామకర్మలోవుంది

    మానవజన్మ
    మీ చేతిలోలేదు
    ఉన్న గడియలు
    మీ చేతిలోవుంది

    మీ మంచితనం
    మీలోఉన్న మంచితనములోలేదు
    మీలోవున్న మంచిని పదిమందికి పంచడములోవుంది

    మీ సంతోషం
    మీకున్న ధనములోలేదు

    మీ సంతోషం
    మీకున్నదానితో
    సంత్రుప్తిపడడములోవుంది

    మీ ఆనందం
    పెంచుకున్న ధనములోలేదు
    మీ ఆనందం
    ఉంచికున్న బంధాలులోవుంది

    మీ గౌరవము
    మీరు పెధవరాచేప్పే మాటలలోలేదు
    మీ గౌరవము
    మీరు మనసార పలుకే పలుకులలోవుంది

    మీ గొప్పతనము
    మీరు సాధించిన విధ్యలలోలేదు
    మీ గొప్పతనము
    మీ విద్యను యితరలకు ఉపయోగించడములోవుంది

    ReplyDelete
  11. మలేషియా దేశము
    రచన-ఆడారి అప్పన్ననాయుడు
    మలేషియా దేశము
    ఒక చక్కని బృందావనము
    ఎటు చూసినా పచ్చదనము
    మనసుకు ఇచ్చును చల్లదనము

    దేశమంతా అంధమైన కొండలు
    వాటిచుట్టూ పాడిపంటలు
    ప్రతిచోట అంధమైన దేవాలయాలు
    అనుబవించవచ్చు పలు కలాచారాలు

    ప్రతిచోట సుబ్రమైన పట్టణాలు
    అందులో అంధమైన కట్టడాలు
    ముఖ్యముగా ట్విన్ టవర్లు
    అందులో కలవు 88 అంతస్తులు

    ఎటుచూసినా విశాలమైన దారులు
    జయప్రదమైన వాడరేవులు
    పలురకములైన రైలుబండీలు
    అంతర్జాతీయ వీమనాశ్రాయాలు

    ప్రయాణికులకు మంచి బసులు
    వుండడానికి మంచి హోటలు
    చూడడానికి పలు స్తలాలు
    ఋషికి పలురకమైన బోజనాలు

    జనసంక్య 27 కోట్లు
    అందులో ఆంధ్రులు మూడు లక్షలు
    నివాసం చేసేవారు పలుజాతులు
    వారికి పలు మతాలు

    మలేషియా దేశము
    ఒక చక్కని బృందావనము
    ఎటుచూసినా పచ్చదనము
    మనసుకుఇచ్చును చల్లదనము

    ReplyDelete
  12. ఇది విశాలమైన ప్రపంచము
    రచన-ఆడారి అప్పన్న నాయుడు

    ఇది విశాలమైన ప్రపంచము
    అందచందాలు నిండిన ధైవలోకము
    దేవుడు వోసంగిన గొప్పవరము
    అనుబవించుము అనుదినము

    బగవంతుడు ఇచ్చిన లోక గృహములో
    కలదు కలదు అందరీకి కొంత స్తలము
    ఈ జీవిత తత్కాలికమును తెలిసుకోనుటలో
    కలదు కలదు అందరిలో వివేకము

    ఇది విశాలమైన ప్రపంచము
    అందచందాలు నిండిన ధైవలోకము

    నిజము తెలిసికొని బ్రతుకుటలో
    తొలగించ వచ్చున్ను మనలో అవివివేకము
    ఆశలు తగ్గించ్చుకొని జీవించుటలో
    ఐక్యమత్వమును మనలో పెంచగలము

    ఇది విశాలమైన ప్రపంచము
    అందచందాలు నిండిన ధైవలోకము

    యుద్ధములు చెలరేగుతున్న లోకములో
    శాంతియుతను పరిమలించగలము
    క్రోధగునము విరబూసే ప్రతి మనిషిలో
    ప్రేమత్వమును స్తిరపరచగలము

    ఇది విశాలమైన ప్రపంచము
    అందచందాలు నిండిన ధైవలోకము

    మనిషికి కావలిసిన గృహములో
    జీవించ వచ్చును కుటుంబ సంమేతము
    శాంతము కలిగిన గునములో
    ఆశ్రమివ్వ గలము అందరకి వున్నకాలము

    ఇది విశాలమైన ప్రపంచము
    అందచందాలు నిండిన ధైవలోకము
    దేవుడు వోసంగిన గొప్పవరము
    అనుబవించుము అనుదినము

    ReplyDelete
  13. ఈ వున్న సమయములో

    …By ఆడారి అప్పన్న నాయుడు

    పుట్టేటప్పుడు నీకు తెలియదు
    పోయేటప్పుడు నీకు తెలియదు
    ఎంతకాలము వుంటావో నీకు తెలియదు
    ఎందుకు పుట్టావోకూడా నీకు తెలియదు

    ఈ వున్న సమయములో..

    ప్రేమయే నీ అత్మతీరని గ్రహించుకో
    అహింసయే మంచి మార్గమని తెలుసుకో
    ధర్మముతో నీ బాధ్యతులను పాటించుకో
    సత్యముతో నీ జీవనతరంగాని సాగించికో

    పుట్టేటప్పుడు నీకు తెలియదు
    పోయేటప్పుడు నీకు తెలియదు

    ఈ వున్న సమయములో..

    సహనముతో జీవితం సాగించుకో
    సమగునముతో అందరిని ఆధరించికో
    దానధర్మాలు పలితాలు ఆశించక చేసుకో
    చేసిన సేవలు బగవంతునికే అంకితం చేసుకో

    పుట్టేటప్పుడు నీకు తెలియదు
    పోయేటప్పుడు నీకు తెలియదు

    ఈ వున్న సమయములో..

    తల్లితండ్రులను ప్రేమతో చూసుకో
    చదువు చెప్పిన గురువులను మనసారా గౌరవించుకో
    అన్నదమ్ములను ఆనందముతో ఆదుకో
    అక్కచేల్లెలను అనురాగముతో కౌగలించికో

    పుట్టేటప్పుడు నీకు తెలియదు
    పోయేటప్పుడు నీకు తెలియదు

    ఈ వున్న సమయములో..

    తెలుగు భాష మాదుర్యనీ లోకమంతా చాటుకో
    తెలుగు కలలని నలుమూలల పెంపొంధించకో
    నేనూ తెలుగువాడునని గర్వంగా చెప్పుకో
    తెలుగే నీవని, నీవే తెలుగని గ్రహించుకో

    ReplyDelete
  14. నీ జన్మకి మూలకారణము అమ్మేరా

    ఆడారి అప్పన్ననాయుడు, మలేషియా

    నీ జన్మకి మూలకారణము అమ్మేరా
    ఆ అమ్మను ప్రేమించుము మనసారా
    ... అమ్మ లేనిదే నీవు లేవని తెలుసుకోరా
    ఆ అమ్మను జీవితమంతా ఆధరించారా

    అమ్మ ఒక్కటే నీ ఆకలిని దినదినము తీర్చుతుందిరా
    అమ్మ ఒక్కటే నీ సంతోషముకోసము జీవిస్తుందిరా
    అమ్మ ఒక్కటే నీ కష్టనష్టాలలో పాలు పంచుతిందిరా
    అమ్మ ఒక్కటే నీ జయమునిచూసి కనులారా ఆనంధిస్తుందిరా

    నీ జన్మకి మూలకారణము అమ్మేరా
    ఆ అమ్మను ప్రేమించుము మనసారా

    అనురాగానికి అనువాదమే మీ అమ్మేరా
    ఆనందానికి ప్రతిరూపమే మీ అమ్మేరా
    అనుదినము కనురెప్పలా చూసేది అమ్మేరా
    అనుదినము మీ కొరకు వేచివుండేది మీ అమ్మేరా

    నీ జన్మకి మూలకారణము అమ్మేరా
    ఆ అమ్మను ప్రేమించుము మనసారా

    అమ్మ ప్రేమ గృహమంతా వ్యాపించునురా
    అమ్మ కోపం గడియలో కరిగి పోవునురా
    అమ్మ అనురాగము అది దైవ సంకల్పమురా
    అమ్మ ఆషయాలు నీవు తెలుసుకొని నేరవేర్చుమురా

    నీ జన్మకి మూలకారణము అమ్మేరా
    ఆ అమ్మను ప్రేమించుము మనసారా
    అమ్మ లేనిదే నీవు లేవని తెలుసుకోరా
    ఆ అమ్మను జీవితమంతా ఆధరించారా

    ReplyDelete
  15. ధన్యవాదాలు

    రచన అప్పన్న నాయుడు ఆడారి

    మానవ రూపం ఇచ్చిన దేవునికి దండాలు
    జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు దండాలు
    అన్నం పెట్టిన అమ్మకు దన్యవాదాలు
    దారి చూపిన తండ్రికి క్రుతంజ్నతలు
    సంతతి ఇచ్చిన సతీమణికి దన్యవాదాలు
    సంతృప్తి ఇచ్చిన పిల్లలకు క్రుతంజ్నతలు
    విద్య వొసంగిన ఉపాధ్యాయులకు దన్యవాదాలు
    మంచితనాని పెంచిన స్వామీజలకు క్రుతంజ్నతలు
    కళలు పెంచుతున్న కళాకారులకు దన్యవాదాలు
    కలాచారని కాపాడుతున్నతెలుగు సంఘాలకు క్రుతంజ్నతలు
    పంటలు పండిస్తున్న అన్నదాతలకు దన్యవాదాలు
    దానధర్మాలు చేస్తున్న ధర్మధాతలకు క్రుతంజ్నతలు
    నవకల్పనాలను చేస్తున్న వైజ్ఞావంతులకు దన్యవాదాలు
    వినోదాని ఇస్తున్నమాస్మీడియాకు క్రుతంజ్నతలు

    ReplyDelete
  16. దైవమే శాశ్వతం అనుక్షనమున
    .....అడారి అప్పన్ననాయుడు

    పోయేటి వయసుకోసం
    పోయేటి అందంకోసం
    ఎందుకు ఇంత అలంకరణ, అనుక్ష్నమున

    పోయేటి జనులుకోసం
    పోయేటి జీవులకోసం
    ఎందుకు ఇంత ఆవేదన, అనుక్షనమున

    పోయేటి ధనముకోసం
    పోయేటి అస్తులుకోసం
    ఎందుకు ఇంత సేకరణ, అనుక్షనమున

    ధైవంతప్ప వేరేది శాశ్వతంకాదు తెలుసుకో అనుక్షనమున
    ఈ నిజం తెలిసికొని సుకసంతోశాలతో జీవించుము దినదినమున

    ReplyDelete
  17. మనుషుల ప్రబావం
    రచన-అప్పన్న నాయుడు ఆడారి

    కొందరికి ఇల్లే ప్రపంచం
    మరి కొందరికి ప్రపంచమే ఇల్లు
    ... కొందరికి జీతమే జీవితం
    మరి కొందరికి జీవితమే జీతము
    కొందరికి ప్రియురాలే లోకం
    మరి కొందరికి లోకమంతా ప్రియరాలే
    కొందరికి ధనమే ప్రపంచం
    మరి కొందరికి ప్రపంచమంతా ధనమే
    కొందరికి నమ్మకమే జీవితం
    మరి కొందరికి జీవితమే నమ్మకం
    కొందరికి సంతోషమే జీవితం
    మరి కొందరికి జీవితమే సంతోషం
    కొందరికి మనసంతా బంగారం
    మరి కొందరికి వొళ్ళంతా బంగారం
    కొందరికి తన వారే కుటుంబం
    మరి కొందరికి మంచివరంతా తన కుటుంబం

    ReplyDelete
  18. తెలుసునా నీ అందం నీకు తెలుసునా

    రచన- ఆడారి అప్పన్ననాయుడు

    తెలుసునా
    నీ అందం నీకు తెలుసునా

    నీ కనుచూపులలో వుంది అందం
    నీ చిరునవ్వులలోవుంది అందం
    నీ బుగ్గలలోవుంది అందం
    నీ సిగ్గులలోవుంది అందం

    తెలుసునా
    నీ అందం నీకు తెలుసునా

    నీ మనసులలోవుంది అందం
    నీ సోగసులలోవుంది అందం
    నీ ఆతిధములలోవుంది అందం
    నీ ఆనురాగములలో అందం

    తెలుసునా
    నీ అందం నీకు తెలుసునా

    నీ కట్టుబట్టలలోవుంది అందం
    నీ గట్టిమాతలలోవుంది అందం
    నీ నడకలలోవుంది అందం
    నీ సరీరములలోవుంది అందం

    తెలుసునా
    నీ అందం నీకు తెలుసునా

    ReplyDelete
  19. దేముడు ఏమి ఇచ్చాడు?

    రచన -అప్పన్న నాయుడు ఆడారి

    ఆకాశం ఇచ్చాడు దేముడు
    ఆకాశమే మీకు హద్దు అని చెప్పడానికి
    వెన్నెల ఇచ్చాడు దేముడు
    చీకటిలో వెలుతురు చూడమని
    గాలిని ఇచ్చాడు దేముడు
    జీవితం గాలిలా సాగించమని
    పచ్చదనాని ఇచ్చాడు దేముడు
    మానవులని పచ్చగా ఉండమని
    కొండలు ఇచ్చాడు దేముడు
    బ్రతుకులో ఎత్తు పల్లాలు తెలుసుకోమని
    మనసు ఇచ్చాడు దేముడు
    నీలోవున్న మంచితన్నాని గ్రహించమని
    బుద్ధి ఇచ్చాడు దేముడు
    బుద్ధివంతుడుగా ఉండమని
    దేముడు ఇచ్చిన ప్రకృతిని కాపాడమని

    ReplyDelete
  20. బహుమతి

    రచన - అప్పన్న నాయుడు ఆడారి

    బగవంతుడు బహుకరించాడు జనులకి గ్రేహం బెల్ని
    ఎంత దూరమైనా టెలి ఫోనే ద్వారా సంబాసించమని
    బగవంతుడు బహుకరించాడు జనులకి రైట్ట్ అన్నదమ్ములని
    విమానములో విదేశాలకు పర్యటించమని
    బగవంతుడు బహుకరించాడు జనులకి తోమాస్ ఎడిసంని
    చీకటిలో విద్యుత్ సక్తిద్వార వెలుతురు చూడమని
    బగవంతుడు బహుకరించాడు జనులకి కొన్రాడ్ జుసేన్ని
    కొమ్ప్యుటర్ ద్వారా లోక న్యాణం పెంచుకోమని
    బగవంతుడు బహుకరించాడు జనులకి వ్లడిమిర్ని
    వినోదాన్ని టెలివిశేన్ ద్వారా చూడమని
    బగవంతుడు బహుకరించాడు జనులకి కాల్ బెన్జ్ని
    కాళ్ళకి విరామం ఇచ్చి కారులో షికారు చేయమని
    మనుషుల ద్వారా ఎన ఎన్నో బహుకరించాడు బగవంతుడు
    మనుషుల ద్వారా ఎన్నో ఎన్నోనో బహుకరించాడు బగవంతుడు

    ReplyDelete